Breaking News

జగనన్న గ్రీన్ విలేజ్ లో హౌసింగ్ అధికారులు గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి…

-ఎమ్మెల్యే డిఎన్ఆర్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టి వేగవంతంగా పూర్తిచేయాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం కైకలూరు ఏలూరు రోడ్డులో ఉన్న జగనన్న గ్రీన్ విలేజ్ లో హౌసింగ్ ఏఈఈ శ్రీరామచంద్రమూర్తి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో చరణ్,ఇంజినీరింగ్ అసిస్టెంట్ లతో కలిసి ఇంటి నిర్మాణాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో ఇంత పెద్ద లే అవుట్ ఏర్పాటు అయ్యిందని, లబ్ధిదారులు అందరు కూడా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలనీ అన్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం 1.80లక్షలు రూపాయలు ఇస్తుందన్నారు. అదేకాక డ్వాక్రా ద్వారా మరో రూ. 50వేల రూపాయలు రుణం ఇస్తున్నారన్నారు. వీటితో పాటు ప్రభుత్వం 20టన్నుల ఇసుక 3500రూపాయలకే అందిస్తుంద్నారు. 90 సిమెంట్ బస్తాలు, ఐరన్ కూడా ప్రభుత్వం అందిస్తుందని, ఇటువంటి చక్కని అవకాశం కల్పింస్తున్నందున ఇంటి పట్టాలు పొందిన అక్కచెల్లమ్మలు హౌసింగ్ అధికారులను కలిసి, మీ పేరులు నమోదు చేసుకొని, మెటీరియల్ తీసుకోవాలని తెలిపారు. అదేవిదంగా జగనన్న, గ్రీన్ లే అవుట్ లో లబ్ధిదారులు తీసుకునే మెటీరియల్ వారి వారి ఇంటి స్థలంలోనే దింపుకోవాలని, రోడ్ల పైన మెటీరియల్ దింపడం వలన పక్క స్థలం వారికీ మెటీరియల్ వెళ్లడం లేదన్నారు. హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని లబ్ధిదారులతో ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలనీ ఆదేశించారు. అదేవిదంగా తక్షణమే రోడ్డులు మరమ్మతులకు ట్రాక్టర్ లను పిలిపించి బాగు చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు, శ్యామల, చైతన్య, రాహుల్, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *