-ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-కొత్తగా చేయబోయే రెగులేషన్స్ కొత్తగా చేరబోయే ఉద్యోగులకు వర్తిస్తాయి..ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు
-డీఏ విషయం లో త్వరలోనే శుభవార్త
-అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులను పరిగణం లోకి తీసుకుంటాం
-ప్రతికూల సమయాల్లో ఉద్యోగులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం
-విద్యుత్ సంస్థలు ఉత్తమ ప్రమాణాల అమలు ద్వారా దాదాపు రూ 2500 కోట్లు ఆదా చేసాయి
-ఉద్యోగుల అంశాలు చర్చించటానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది — ఇంధన శాఖ మంత్రి
-విద్యుత్ రంగానికి 2019-20 & 2020-21 లో రూ.28166 కోట్లు ప్రభుత్వం విడుదల
-ట్రాన్స్మిషన్ నష్టాలు 2020 లో 2. 91 శాతం ఉండగా, 2021 లో అవి 2. 60 శాతానికి తగ్గాయి
-విశాఖపట్నంలో రూ 457. 935 కోట్లు వ్యయం తో ఇప్పటి వరకు 53003 సర్వీసులకు అండర్ గ్రౌండ్ కేబిలింగ్
-రూ 68. 12 కోట్ల వ్యయం తో విజయవాడ, గుంటూరు నగరాల్లో 16 ఇన్డోర్ సబ్ స్టేషన్ల నిర్మాణం
-డీడీయుజీజెవై ప్రోగ్రాం కింద, ఏపీఎస్పీడీసిఎల్ రూ 521.54 కోట్ల వ్యయం తో 33/11 కే వీ సబ్ స్టేషన్లు , విద్యుత్ లైన్లను నిర్మాణం
-రూ 5. 5 కోట్ల వ్యయంతో గొల్లపూడిలో తొలిసారిగా కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మాణం
-విద్యుత్ సంస్థలకు ఉద్యోగులు పునాదిలాంటి వారు — ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ సంస్థల ఉద్యోగస్తుల జీత భత్యాలు గురించి పీ ఆర్ సి పే రివిజన్ కమిటీ నిర్ణయిస్తుందని, ఈ విషయంలో ఉద్యోగస్తులెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని ఇంధన, అటవీ , పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు . దీని పై సోషల్ మీడియా లో వచ్చే వార్తలు , కధనాలు ఉద్యోగస్తులెవరూ పట్టించుకోవలసిన అవసరం లేదని , అలాంటివి ఏమైనా ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు.
ఏపీసిపీడీసిఎల్ ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు , క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో విజయవాడ లో మంగళవారం నాడు అన్ని విద్యుత్ సంస్థలు.. ట్రాన్స్కో, జెన్కో , ఏ పీ ఈ పీ డీ సి ఎల్ , ఏ పీ ఎస్ పీ డీ సి ఎల్ , ఏ పీ సి పీ డీ సి ఎల్ , న్దేక్యాప్ , ఎస్ఈసిఎం, ఏపీసీడ్కో సంబందించిన ఉద్యోగులు భారీ ఎత్తున హాజరైన వేదిక లో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రసంగిస్తూ.. ఇప్పుడు కొత్తగా చేయబోయే రెగులేషన్స్ కొత్తగా చేరబోయే ఉద్యోగులకు వర్తిస్తాయని , ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసారు. కంపేషనేట్ అపాయింట్మెంట్ ఏదైనా రేగులేషన్ కు అనుగుణంగానే జరుగుతాయన్నారు.
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యొక్క ఇబ్బందులను పరిగణం లోకి తీసుకుని వారికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. డీఏ విషయం మీద త్వరలోనే ఉద్యోగలు త్వరలోనే శుభవార్త వింటారన్నారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారి వారి సిఎండీ లను కలిసి విన్నవించినచో దాని మీద వారు తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించటం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన 24x 7 విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. కరోనా మహమ్మారి, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల నడుమ 2021 సంవత్సరంలో, వినియోగదారులకు విజయవంతంగా సేవలందించినందుకు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియచేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ పథకం విజయవంతంగా అమలయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి అభినందనలు తెలియచేసారు . దీనివల్ల రాష్ట్రంలో రైతాంగం ఎంతో సంతోషంగా ఉందని, వ్యవసాయ దిగుబడులు పెరిగేందుకు, తద్వారా రైతుల ఆదాయం పెరిగేందుకు ఉచిత విద్యుత్ దోహదకారి అయిందన్నారు.
బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు, ఇతర ఉత్తమ ప్రమాణాల అమలు ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాదాపు రూ 2500 కోట్లు ఆదా చేయగలిగాయని, దేశంలో మరేరాష్ట్రం విద్యుత్ కొనుగోలు లో ఇంత పెద్ద మొత్తం లో ప్రజాధనాన్ని ఆదా చేయలేకపోయాయని, . కేంద్ర విద్యుత్ శాఖ కూడా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రశంసించిందన్నారు.
విద్యుత్తు సంస్థల విజయాల్లో ఉద్యోగులు, సిబ్బందిదే కీలక పాత్ర. సంస్థల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలను ఎప్పటికపుడు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు .
విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు 7,329 మంది లైన్ మెన్లను , 213 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు . విద్యుత్ సంస్థలను బలోపేతం చెయ్యడమే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైన అది విద్యుత్ ఉద్యోగుల అంశాలైన సరే సానుకూలంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృత నిశ్చయం తో వుందన్నారు. ఈ ప్రభుత్వం లో ఏ ఒక్క ఉద్యోగి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, . తమది ప్రజా ప్రభుత్వం. ప్రజలకోసం పనిచేస్తామని ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తుందన్నారు.
వినియోగదారులకు అందించే సేవలను మరింత మెరుగు పరిచేందుకు ఆధునిక పద్ధతులను అన్వేషించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తుందని వారు చేసే సేవలను అభినందించారు . ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమన్నారు.
ఉద్యోగుల అంశాలను చర్చించటానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని , ఇందుకు సంబందించి ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు .
విద్యుత్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటిదని, ఈ వ్యవస్థలో ఉద్యోగులు ప్రధాన భాగస్వాములని , ప్రభుత్వము , ఉద్యోగులు, అందరు కలిసి నిరంతర , నాణ్యమైన విద్యుత్ సరఫరా వినియోగదారులకు ఇవ్వాలని, విద్యుత్ వ్యవస్థలో స్వయంసమృద్ధి సాధించటమే అంతిమ ధ్యేయమని చెప్పారు . కరోనాలో, వరదల్లో ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పనిచేసారని ఇంధన శాఖ మంత్రి అన్నారు.
ఈ వేదిక మీద పాల్గొన్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 & 2020-21 సంవత్సరాలలో రూ.28166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు విద్యుత్ సంస్థలకు రూ 5330.04 కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు.
ట్రాన్స్మిషన్ నష్టాలు 2020 లో 2. 91 శాతం ఉండగా, 2021 లో అవి 2. 60 శాతానికి తగ్గాయన్నారు . వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా మరింత మెరుగుపరచడంలో భాగంగా రియల్ టైం ఫీడెర్ మానిటరింగ్ సిస్టం (ఆర్ టీ ఎఫ్ ఎం ఎస్ ) ను ఏపీఈపీడీసిఎల్ అభివృద్ధి చేసిందన్నారు . దీనివల్ల విద్యుత్ అంతరాయాల షెడ్యూల్ ను ముందే తెలుసుకోవచ్చన్నారు.
ఏపీడీఆర్పీలో భాగంగా 33/11 కె వీ సబ్ స్టేషన్లు 35, అలాగే 11 కేవీ ఫీడర్లు 151 ని కవర్ చేస్తూ అండర్ గ్రౌండ్ కేబిలింగ్ వేయటం జరుగుతుందన్నారు . వీటికోసం రూ 755.2 కోట్లు కేటాయించారన్నారు . దీనిలో భాగం విశాఖపట్నంలో ఇప్పటి వరకు 53003 సర్వీసులను అండర్ గ్రౌండ్ కేబిలింగ్ లో కవర్ చేయటం జరిగిందన్నారు . దీనికోసం రూ 457. 935 కోట్లు వ్యయం చేయటం జరిగిందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కాలనీలను, ఇళ్లను విద్యుదీకరణ చేయటంలో భాగంగా డీడీయుజీజెవై ప్రోగ్రాం కింద, 33/11 కే వీ సబ్ స్టేషన్లు , విద్యుత్ లైన్లను ఏపీఎస్పీడీసిఎల్ నిర్మాణం చేస్తోందన్నారు . ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ 521.54 కోట్లు కాగా, ఇందులో రూ. 313 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గా ఇస్తుందని, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కింద 525947 సర్వీసులను విడుదల చేయటం జరిగిందన్నారు . దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు.
విద్యుత్ సంస్థల పురోగతికి కృషి చేస్తున్న యావత్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికపుడు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటున్నామన్నారు. ఇవి విద్యుత్ రంగ ఉద్యోగులందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయని, ఏ సంస్థకైనా ఉద్యోగులు పునాదిలాంటి వారని, ఆయా సంస్థల విజయం లో వారిదే కీలక పాత్రని, ఉద్యోగులంతా మరింత పట్టుదలతో సమిష్టిగా ఇలాగె కృషి చేస్తే విద్యుత్ సంస్థలు మరిన్ని విజయాలు సాధిస్తాయని చెప్పారు.
ఏపీసిపీడీసిఎల్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సిఎండీ జె పద్మజనార్ధన రెడ్డి మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు నగరాల్లో , ఏపీసిపీడీసిఎల్ 16 ఇన్డోర్ సబ్ స్టేషన్లను నిర్మాణం చేస్తోందని, ఇందుకు రూ 68. 12 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. ఏపీసిపీడీసిఎల్ తొలిసారిగా కంటైనర్ సబ్ స్టేషన్ ను రూ 5. 5 కోట్ల వ్యయంతో కృష్ణ జిల్లాలో గొల్లపూడిలో నిర్మాణం చేస్తోందని, దీని నిర్మాణకి సాధారణ సబ్ స్టేషన్ నిర్మణానికి అవసరమైన భూమి లో కేవలం పది శాతం భూమిలోనే వీటిని నిర్మాణం చేయవచ్చన్నారు . జగనన్న కాలనీలలో ఏపీసిపీడీసిఎల్ ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్లను నిర్మిస్తుందని, దీనికి రూ 6.5 కోట్లు వ్యయం చేయనుందని, ఇది సాధారణ సబ్ స్టేషన్ నిర్మాణానికి సరిపడే భూమితో పోలిస్తే మూడో వంతు భూమి ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి సరిపోతుందని చెప్పారు.
బీ శ్రీధర్, ఎండీ , ఏపీ జెన్కో , ఐ పృథ్వి తేజ్ , జెఎండీ ఏపీట్రాన్స్కో , బీ మల్లా రెడ్డి, జెఎండీ విజిలెన్సు , ఏపీట్రాన్స్కో , జె పద్మ జనార్ధన రెడ్డి , సిఎండీ , ఏపీసిపీడీసిఎల్ , హెచ్ హరనాథ రావు , సిఎండీ , ఏపీఎస్పీడీసిఎల్ , కె సంతోష రావు, సిఎండీ , ఏపీఈపీడీసిఎల్ , ట్రాన్స్కో డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్, ముథుపాండియన్ , జెన్కో డైరెక్టర్ చంద్ర శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.