Breaking News

400 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 65 వేల విలువ గల ఉపకణాలు నమోదు..

-విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ నియోజకవర్గ పరిధిలో 400మంది విభిన్న ప్రతిభావంతులు రూ . 65 వేల రూపాల విలువ గల ఉపకణాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి బి. రామ్ కుమార్ అన్నారు.
స్థానిక కైకాల సత్యనారాయణ మున్సిపల్ ఆడిటోరియంలో మంగళవారం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరాన్ని విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ, ఆర్టిఫిషియల్ మాన్యుఫేక్చరింగ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్యర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడీ రామ్ కుమార్ మాట్లాడుతూ గుడివాడ నియోజక వర్గ పరిధిలో గల గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలలో గల విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వారికి కావలసిన ఉపకరణాలును నమోదు చేసుకొని అందించేందుకు జిల్లా కలెక్టరు వారి ఆదేశాలు మేరకు శిభిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరం నందు వికలాంగులకు కావలసిన బ్యాటరితో నడిచే మూడు చక్రముల సైకిళ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, చెవిటి మిషన్లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఏం.అర్. కిట్లు మొదలగు వాటిని శిభిరానికి వచ్చిన విభిన్న ప్రతిభా వంతులు 400 మంది రూ. 65 వేల రూపాయల విలువ గల ఉపకరణాలను ఎంపిక చేసుకున్నారన్నారు. వీరందరికీ ఏప్రిల్, మే మాసంలో రాష్ట్రపౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి వారి చేతుల మీదుగా లబ్దిదారులకు అందిస్తామన్నారు. ఈ నెల 29 న గన్నవరం నియోజకవర్గంలో గల గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలలో విభిన్న ప్రతిభావంతులకు ఆర్య వైశ్య కళ్యాణ మండపం, గన్నవరం నందు, 30వ తేదీన పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల, పామర్రు, మువ్వ, తోట్లవల్లూరు, పెదపారుపూడి మండలాలలో విభిన్న ప్రతిభావంతులకు జెడ్.పి.హెచ్. స్కూలు, పామర్రు నందు శిబిరములు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఆయా నియోజకవర్గాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరానికి వచ్చే విభిన్న ప్రతిభావంతులు వారి వికలాంగ దృవీకరణ పత్రము (సదరం సర్టిఫికేటు), ఆధార్ కార్డు, రేషన్ కార్డు(3 సెట్లు), 4 ఫోటోలతో హాజరు కావాలని ఏడీ రామ్ కుమార్ తెలిపారు.
నందివాడ యంపీపీ ఆదాం మాట్లాడుతూ అర్హులైన విభిన్న ప్రతిభా వంతులందరికీ ఉపకరణాలను అందేంచాలన్నదే ప్రభుత్వ లక్షమన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉపకరణాలు ఎంపిక శిబిరాలను ఏర్పాటు చేసి నమోదు చేసుకోవడం తదుపరి వారికి ఉపకరణాలు అందించడం చాలా సంతోషం అన్నారు. అర్హలైన వారు ఎవరైనా నమోదుచేసుకోలేనట్లయితే సంబందిత ఎంపీడీవో కార్యాలయంలో నమోదుచేసుకోవచ్చున్నారు.
ఉపకరణాలు ఎంపిక నమోదు కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, పలువురు విభిన్న ప్రతివా వంతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *