-జనసేన పార్టీ విశాఖ స్టీల్,రోడ్ల దుస్థితి,అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల కోసం పోరాడింది
-వైసీపీ పార్టీకి కేవలం దోచుకోవడం…దాచుకోవడం మాత్రమే తెలుసు
-8 జిల్లాలో నియోజకవర్గాల్లో మండల అధ్యక్షులను అధిష్టానం ప్రకటించింది
-విజయవాడలో 58 డివిజన్ల అధ్యక్షులను ప్రకటించాం
-65 శాతం డివిజన్ అధ్యక్షులను యస్సి,ఎస్టీ బీసీ,మైనారిటీలకు కేటాయించాం
-ప్రజాసమస్యలపై అవగాహన ఉన్నవారిని డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది
-వంగవీటి రాధా నిస్వార్థ నాయకుడు , పేదలకు అండగా నిలబడే వ్యక్తి,మచ్చలేని నేత
-వంగవీటి రాధా పై రెక్కీ నిర్వహించడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజాసమస్యల పై పోరాడిందని,విశాఖ స్టీల్,రోడ్ల దుస్థితి,అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల కోసం పోరాడిందని,2022లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాంమని,వైసీపీ పార్టీకి కేవలం దోచుకోవడం…దాచుకోవడం మాత్రమే తెలుసని,ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కోసం జనసేన కట్టుబడి ఉందని,రానున్న రోజుల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయంమని,జనసేన ఎపుడు ప్రజల పక్షాన ఉంటుందని, జనసేనకు క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని, స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన తరపున పోటీ చేసేందుకు పోటీ పడ్డారని,పవన్ కళ్యాణ్ చూపించిన మార్గంలో నడిచేందుకు యువత సిద్దంగా ఉన్నారని, 8 జిల్లాలో నియోజకవర్గాల్లో మండల అధ్యక్షులను అధిష్టానం ప్రకటించిందని, జిల్లాల వారీగా వంద నియోజకవర్గాలలో పార్టీ నేతల నియామకం చేశారని,డబ్బు, మద్యం పంచకుండా నిజాయతీగా రాజకీయం చేస్తున్న ఏకైక నేత పవన్ కళ్యాణ్ అని,విజయవాడలో 58 డివిజన్ల అధ్యక్షులను ప్రకటించాంమని,65 శాతం డివిజన్ అధ్యక్షులను యస్సి,ఎస్టీ బీసీ,మైనారిటీలకు కేటాయించాంమని, 58 మంది అధ్యక్షులలో 25 మంది గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యూయేట్ చేసిన వారు ఉన్నారని, జేబు దొంగలుకో, నేరచరిత్ర ఉన్నవారికో, దోచుకునే వారినో నియమించలేదఅని,ప్రజాసమస్యలపై అవగాహన ఉన్నవారిని డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని,మిగతా పార్టీల్లాగా వాడుకోవడం…వదులుకోవడం మాసిద్ధాంతం కాదఅని, ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి ప్రజలకు నరకం చూపిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చావుదెబ్బ కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయని, ఇంటిన్ను, చెత్తపన్ను, వన్ టైమ్ సెటిల్ మెంట్ పై కొట్టకమిటీలతో రానున్న రోజుల్లో పోరాడుతాంమని, వైసిపి కార్పొరేటర్లు ఒక్కరైనా పన్నుల పెంపుపై కౌన్సిల్ లో మాట్లాడలేదని, కార్పొరేషన్స్ కాంట్రాక్ట్ లు,అక్రమ కట్టడాలపై వైసీపీ కార్పొరేటర్లకు శ్రద్ధ ఉందని, వంగవీటి వంగవీటి రాధా పై రెక్కీ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వంగవీటి రాధా నిస్వార్థ నాయకుడని,పేదలకు అండగా నిలబడే వ్యక్తి, మచ్చలేని నేత అని,ఏరోజు పదవులకోసం ప్రాకులాడలేదని, అలాంటి నేతపై రెక్కీ నిర్వహించడం దారుణంమని, రెక్కీ నిర్వహించడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని, పోలీసశాఖ వారు లోతుగా దర్యాప్తు చేపట్టి,రెక్కీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మహేష్ డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు వెన్నాశివ శంకర్, కామాల సోమనాథం, జనసేన నాయకులు జగడం శ్రీనివాస్, నజీబ్, బావి శెట్టి శ్రీను, వెంకటేష్, శివ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.