Breaking News

ట్రెయేజింగ్ పక్కాగా నిర్వహించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా వైరస్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ట్రెయేజింగ్ పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో వైరస్ బాధితులకు అందించే వైద్య చికిత్స, కల్పించవలసి సౌకర్యాలు తదితర అంశాలపై మంగళవారం నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు కలెక్టర్ జె.నివాస్ ఆసుపత్రి హెచ్ ఓ డి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలో బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా ట్రయేజ్ లోనే కేసులను గుర్తించి వైద్యచికిత్స అందించినట్లయితే రోగులు త్వరితగతిన కోలుకోగలరన్నారు. కంట్రోల్ రూమ్ నుండి ట్రయేజ్  ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీనియర్ మెడికల్ ఆఫీసర్లు విధుల్లో ఉండేలా చూడాలన్నారు. రోగుల చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్ లో నమోదు చేయాలన్నారు. వైద్యపరికరాల కొనుగోలు, అవసరమయ్యే వాటికి మరమ్మతులు నిర్వహించేందుకు అవసరమయ్యే నిధులను ఖర్చు చేసేందుకు అనుమతులు మంజూరు చేశారు. కోవిడ్ కు కేటాయించిన బడ్జెట్ ను కోవిడ్ కే వాడాలని, ఆసుపత్రి బడ్జెట్ నిధుల నుంచి వాడరాదన్నారు. కోవిడ్ బాధితులకు అవసరమయ్యే అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని వార్డులలో లాన్ కనెక్షన్ ఉండాలని, కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. హెచ్ ఓ డి తో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తొలుత ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, వారు అందిస్తున్న సేవలు, పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం 802 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. వీటిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 300 జీజీహెచ్ లో 500 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. కోవిడ్ బాధితులకు అవసరమయ్యే అన్ని వైద్య చికిత్సలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ శివ శంకర్ వివరించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్, ఆసుపత్రి సూపరిండెంట్ డా.సి వై కిరణ్ కుమార్, ఆసుపత్రి వివిధ భాగాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *