నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యలు తెలియజేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి స్పష్టం చేసారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి పెరుగుతున్నదని, ఇటువంటి సమయంలో వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ప్రజా సమూహాల వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు మాస్క్ తప్పనిసరిగా ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలన్నారు. సామజిక సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజా సమూహాల వారు తమ దరఖాస్తులను అందించే సమయంలో ప్రజలందరూ మూకుమ్మడిగా కార్యాలయాలలో రావడం, సామాజిక దూరం పాటించక పోవడం కారణంతో కోవిడ్ ప్రబలే ప్రమాదముందన్నారు. కావున ప్రజా సమూహాలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతోపాటు దరఖాస్తును అందించే సమయంలో ఒకరు, ఇద్దరు ప్రతినిధులు మాత్రమే సంబంధిత అధికారికి వద్దకు వెళ్లి దరఖాస్తును అందించాలన్నారు. దీనివల్ల కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కృషి చేసినవారు అవుతారన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
Tags nuzividu
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …