విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ వైరస్ బాదితులకు సేవలందించే వైద్యులు నర్సులు, పర్యవేక్షకులు, సెక్యూరిటిగార్డులకు, వైరస్ నుండి రక్షణ కల్పించే వస్తువులను అందించేందు కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని సూపర్‌స్పెషలిటీ ఆసుపత్రిలో కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె. నివాస్ ముఖ్య అతిధిగా హాజరై 85 లక్షల విలువైన వివిధ రకాల రక్షణ వస్తువులను ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కూడా కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ కోవిడ్-19 పై వేతిరేకంగా పోరాటంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిందన్నారు. ప్రస్తుత కోవిడ్ మూడో దశలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అందించిన పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ రక్షణ పరికరాల్లో ముఖ్యంగా పిపిఇ కిట్లు, ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్ బాటిల్స్, గ్లజులు, ఫల్స్‌ఆక్సిమీటర్లు అందించి ముందుకు రావడం పట్ల సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటంలో డాక్టర్లు, నర్సులు, ఎక్స్‌రే టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్‌లకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థను స్పూర్తిగా తీసుకుని మరిన్ని ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు.
ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్, సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డా. సివై. కిరణ్‌కుమార్, కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ కో`ఆర్డినేటర్ డా.రోజారాణి, తదితరలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …