విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్ లీ హుడ్ మిషన్ మరియు స్వచ్చ భారత మిషన్ (DAY– NULM & SBM) కన్వర్జెన్స్ ప్రోగ్రాం ను అమలు పరచుటకు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, అర్బన్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వారి ప్రతినిధులు సహకారముతో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను అర్బన్ కమ్యూనిటి డెవలప్మెంట్ మరియు పబ్లిక్ హెల్త్ సిబ్బందికి నిర్వహించుట జరిగింది.
సదరు కార్యక్రమములో నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ పొదుపు సంఘాల శానిటేషన్ సంబంధిత వివిధ జీవనోపాధి అవకాశాలను గుర్తించి వారికి ప్రాధాన్యత కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించుటకు యు.సి.డి. మరియు పబ్లిక్ హెల్త్ విభాగములు సంయుక్తoగా కలిసి పని చేయాలని నగరపాలక సంస్థ లో ఈ ప్రోగ్రామ్ ను విజయవంతము చేయవలసినదిగా సిబ్బందికి పిలువు నిచ్చారు.
ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గితభాయి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి టి. సుధాకర్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) వెంకట లక్ష్మి, హెల్త్ ఆఫీసుర్లు, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, యు.సి.డి సిబ్బంది మరియు అర్బన్ మానేజ్మెంట్ వారి తరుపున కో-ఆర్డినేటర్ కుమారి శ్రావ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.