మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 12 వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించాలని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ ప్రతిపాదిస్తున్నారు దీనికి సంబంధించి గౌరవ చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ , ప్రిన్సిపల్ కృష్ణాజిల్లా జడ్జి జి. రామకృష్ణ బుధవారం (12.01.2022) సాయంత్రం 04.00 గంటల నుండి న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ఆవరణలో స్థానిక న్యాయాధికారులు, వాటాదారులతో సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. పత్రికా విలేకరులు ఈ సమావేశానికి హాజరుకావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
Tags machilipatnam
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …