Breaking News

“ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డిని సత్కరించిన ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ…”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు మంగళవారం ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డిని ఆర్టీసీ హౌస్ లోని ఆయన ఛాంబర్ లో ప్రత్యేకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించి పూల మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్  మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సంస్థ పురోభివృద్ధిలో ఆఫీసర్లు తమవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఎంతో చేసిందని, ఉద్యోగులందరినీ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దేనని గుర్తు చేశారు. తాజాగా పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు పెంచారని, DAలు, PRC ప్రయోజనాలు పి.టి.డి. ఉద్యోగులకు కూడా ఈ నెల నుండే అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు  జి. వెంకట రమణారావు( డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్),  జి.నాగేశ్వరరావు (డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్),  టి.చంద్ర శేఖర్(డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్),  వై. నాగ శేషు, (అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్) డా|| వి. స్వర్ణ కుమారి (సీనియర్ మెడికల్ ఆఫీసర్) మరియు గోపి (OSD to Chairman) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *