Breaking News

జగనన్న లే ఔట్లలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించండి : జేసీ కె. మోహన్ కుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న లే ఔట్లలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనులపై మంగళవారం స్థానిక మునిసిపల్ సమావేశం హాలులో గుడివాడ డివిజన్ స్థాయి అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మోహన్ కుమార్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకునేందుకు వీలుగా అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా, మెటీరియల్ తరలింపునకు రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేందుకు ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు పూర్తి స్థాయి సహకారాన్ని అధికారులు అందించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందని, సిమెంట్, స్టీల్ సబ్సిడీ ధరలపై అందిస్తున్నామని, ఈ సమాచారాన్ని లబ్దిదారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి . రామచంద్రన్, ఆర్డిఓ శ్రీను కుమార్, కృష్ణా జిల్లా RWS సూపరిటెండెంట్ ఇంజనీర్ N.V.V సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, గుడివాడ ఎంపిడివో అనగాని వెంకట రమణ, అసిస్టెంట్ కమిషనర్ రంగరావు మరియు గుడివాడ డివిజన్లోని వివిధ మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *