-గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో పనిచేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం 47 వ డివిజన్ పార్టీ అధ్యక్షులు వేంపల్లి గౌరీశంకర్ నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.దేవుళ్ళ చిత్రపటాలకు జనసేన పార్టీ మహిళా నాయకులు అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు, నగర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు . సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మహేష్ మాట్లాడుతూ 47 డివిజన్ నాయకులు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో డివిజన్లో మరింత విస్తృతంగా ప్రజా సమస్యలపై పోరాడాలని, గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో పనిచేయాలని, అధికార పార్టీ నాయకులకు జనసేన పార్టీ ని చూస్తే భయంతో వణుకుతున్నారని, అందుకే జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కావాలనేవి ఎం సి అధికారులను అడ్డంపెట్టుకుని తొలగిస్తున్నారని, ఇలాంటి పనులు ఎక్కువ రోజులు చేయలేరని, రాబోయే రోజుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటామని, అవినీతి అక్రమాలు చేసే నాయకులను ఇప్పటికే ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పెద్దలు కొప్పిశెట్టి వెంకటేశ్వరావు గారు వ్యవహరించారు. 47వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీశంకర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం దృఢంగా పనిచేస్తామని, డివిజన్ అధ్యక్షుడిగా నియామకం చేసినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి అదేవిధంగా నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తజనోత్.మైనరబాబు , ఎరుపల్లి కనకరావు, చిట్ల .సతీష్ , జిల్లెళ్ళ.అనిల్,చెవుల. శ్రీనుబాబు, రా. గోవింద్ ఆకారపు. విజయకుమారి , మద్దాల. సంగీత, బంటుమిల్లి. రాంబాబు 47 డివిజన్ కార్యవర్గ సభ్యులు మరియు నగర ఉపాధ్యక్షులు1. వెన్న శివశంకర్2. కమల సోమనాథం, నగర కార్యదర్శి శనివారపు. శివ, నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మోబినా, కార్యదర్శిలు వేవిన.నాగరాజు, పాల .రజిని, ఆలియా .బేగం, సబింకర్. నరేష్, రాకీ గౌడ్, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు బుద్ధన్. ప్రసాద్, కరిమి కొండ శివరామకృష్ణ, ఉదయ లక్ష్మి రెడ్డి, మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు 38- తమ్మిన లీలా కరుణాకర్, 39- ఏలూరు సాయి శరత్ ,40-కూరాకుల సురేష్, 44- మల్లెపు. విజయలక్ష్మి ,45- బొమ్ము. రాంబాబు,48- కొరగంజి. రమణ,37- సింగినం శెట్టి. రాము, 50- రెడ్డిపల్లి గంగాధర్,52- నల్లబెల్లి .కనకరావు,25- జగడం శ్రీనివాస్, 6- పెద్దిరెడ్డి. తిలక్, 62-భవాని ప్రసాద్,60- కుప్పల శ్రీనివాస, పుల్లిచేరీ.రమేష్ , ముదన. స్టాలిన్,రాజు,మదన్, పోతిన .అదిత్,పండు, వడ్డే, పాల్గొన్నారు.