విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుబాబుల్ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సుబాబుల్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, ముఖ్యంగా గిట్టుబాటు ధరపై వివిధ పేపర్ మిల్లుల ప్రతినిధులు, ప్లైవుడ్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో శనివారం రాత్రి మంత్రి కురసాల కన్నబాబు నగరంలోని గురునానక్ నగర్ మార్క్ ఫెడ్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుబాబుల్, జామాయిల్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతులకు చెల్లిస్తున్న గిట్టుబాటు ధరలను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని పేపర మిల్లుల ప్రతినిధులను కోరారు. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన చేసి మంత్రివర్గ ఉప సంఘం నందు చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి, కమిషనర్ ప్రద్యుమ్న, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ దివాకర్, వివిధ పేపర్ మిల్లులు, ప్లైవుడ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …