విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
73 గణతంత్ర దినోత్సవం (జనవరి 26), ఓటర్స్ డే (జనవరి 25), సవితా అంబేద్కర్ జయంతి ( జనవరి 27 ) ని పురస్కరించుకుని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ వ్యవస్థాపకులు/అధ్యక్షులు గాంధీ నాగరాజన్ కోరిక మేరకు బి. భారతి (మహిళా అధ్యక్షురాలు-ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యములో వరసగా 3 రోజుల పాటు విజయవాడ సిటీ మొత్తం ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్య పరి రక్షణకై, ప్రతి పౌరుడు ఓటు యొక్క విలువను తెలుసుకుని, పార్టీలకు పార్టీ గుర్తులకు ఓటు వేసే రోజులు పోయి, వ్యక్తికి వ్యక్తిత్వాలకు ఓటు వేసే కాలం రావాలనే ఉద్దేశముతో ప్రజలలో ప్రజాస్వామ్యం పై అవగాహన కొరకు, మార్పు కొరకు ప్రచార యాత్ర మొదలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎన్.శివరంజని (గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్-ప్రధాన మహిళా అధ్యక్షురాలు) ఏర్పాటు చేశారు. గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ఎప్పుడైతే డబ్బు తీసుకుని ఓటు వేసే కాలం పోయి..డబ్బులిచ్చి మంచి వ్యక్తిని ఎంచుకునే రోజు వస్తుందో ఆ రోజు ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలు తమ జీవితాలు నిలుపుకున్నట్టే అన్నారు. ప్రజలను ప్రేమించే నాయకుడు డబ్బుని ప్రేమించడు.. డబ్బు ని ప్రేమించే వ్యక్తి ప్రజలను ప్రేమించడు అని అన్నారు… అందుకే మంచి ఓటు మనం వేద్దాం అది మంచి వ్యక్తికే వేద్దాం అని 1920 లో గాంధీజీ ఓటర్ లని విజ్ఞప్తి చేసారు. రాజ్యాంగము ప్రకారము అంబెడ్కర్ పౌరులకు ఓటు హక్కుని కల్పించారు దానిని మంచిగా ఉపయోగించి రాజుల బ్రతుకుతావో లేక అమ్ముకుని బానిసలా బ్రతుకుతావో ని చేతిలో ఉంది అన్నారు. మంచి వ్యక్తిత్వం లేని వ్యక్తి ఎదిగి దేశానికి ఎటువంటి మంచి చేయలేడు అని అన్నారు. ఒకప్పుడు గాంధీ ఎప్పుడైతే ఒక మహిళ అర్ధ రాత్రి 12 గం లకు ఆభరణాల తో ఒంటరిగా నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని ఇప్పుడు మనం ఆ అనుభవిస్తుంది స్వేచ్ఛ కాదని చెప్పారు. దేశములో కార్య నిర్వహణ లో అమరులైన సైనికులకు, రక్షక భటులకు తుపాకులతో చివరి వీడ్కోలు తెలుపుతారో అదేవిధంగా కామాంధుల కోరల్లో పడి ప్రాణాలు వదిలిన ఆడ బిడ్డలకు చివరి వీడ్కోలుగా సైనిక వందనము జరగాలని గాంధీ నాగరాజన్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో కె.సౌజన్య, ఎం శ్రీదేవి, ఆర్.అపర్ణ, మాస్టర్ కార్తీ, డి.ప్రణవ్ జైసూర్య, వై.రమేష్, ఎన్. రఘు, గంగాధర్ లు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News