అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అండ్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్ ఎఫైర్స్) సీహెచ్.రవికృష్ణ పాల్గొన్నారు. శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 14 నెలల్లోప్లాంట్ ప్రారంభం కావడం ఓ మైలురాయి అని కొనియాడారు. 220 టన్నుల ఆక్సిజన్ తయారీ చేయడం చాలా ముఖ్యమైన విషయమన్నారు. 144 పీఎస్ఏ ప్లాంట్లు కూడా వివిధ ఆస్పత్రుల్లో పెట్టామని,మరో 32 ప్లాంట్లు కూడా పెడుతున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ఆక్సిజన్ విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, 24వేల ఆక్సిజన్ బెడ్లు తయారు చేశామని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 300 టన్నుల ఆక్సిజన్ తయారీలో ఉందని, ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి దీనికి అదనంగా వచ్చిచేరుతుందని పేర్కొన్నారు. కోవిడ్కే కాదు, పరిశ్రమలకూ ఆక్సిజన్ చాలా ముఖ్యమని నోవా ఎయి ర్ ఎండీ గజనన్ నబర్ తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్లాంట్‌పెట్టామని ఇందుకు ఏపీ సరైనదని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, 14 నెలల్లో ప్లాంట్‌ను నిర్మించామని తెలిపారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందని చెప్పారు. కోవిడ్ వేవ్‌ల సమయంలో రవాణాకు, మానవవనరులకు కొరత లేకుండా అధికారులు చూశారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ కారణంగా ఆక్సిజన్ కొరత రాకుండా ఓ ప్లాంట్‌ను తీసుకు రావాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. తద్వారా మెడికల్ ఆక్సిజన్‌కు లోటు రాకుండా రాష్ట్రం స్వయం సమృ ద్ధిసాధించాలంటూ అధికారులకు లక్ష్య నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లోటు లేకుండా చూసే చర్యల్లో భాగంగా ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రోజుకు 220 టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్లాంట్‌లో మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేయనున్నారు. నోవా ఎయిర్‌తో జనవరి 24, 2020న ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చు కుంది. డిసెంబర్ 18, 2020న పనులు ప్రారంభం కాగా, నవంబర్ 2021న పనులు పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మే నేజ్మెంట్, వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవన్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఏ.బాబు, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్, వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జీఎస్.నవీన్‌కుమార్, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్‌కుమార్, డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.