గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా పాడి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించి, మరింత పాల సేకరణ జరిగేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత ప్రమోటర్లను ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ పథకంపై గంపలగూడెం ఎంపిడిఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో ప్రమోటర్లు, మహిళా పాడి రైతులు, అధికార్లతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ పధకంలో పాలు అందించే పాడి రైతులకు అమూల్ సంస్థ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందన్నారు. పాల సేకరణకు అందించిన పాలకు ప్రైవేట్ డైరీల కన్నా మెరుగైన ధర అందించడంతో పాటు, పాడి పశువులకు మేలైన పోషకాలతో కూడిన దాణా, వైద్య సౌకర్యం, పాడి పశువులు కొనుగోలుకు స్వల్ప, దీర్ఘ కాలిక రుణాలు, అందిస్తోందని, ఈ ప్రయోజనాలను మహిళా పాడి రైతులకు తెలియజేసి మరింత మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. జగనన్న పాల వెల్లువ పథకంపై ప్రతీ గ్రామంలోనూ అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి, సమావేశానికి ప్రతీ పాడి రైతు హాజరయ్యేలా చూడాలన్నారు. మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రం లో ప్రమోటర్లుగా నియమించబడే వాళ్ళ ఎంపికలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. . నిరంతరం కేంద్రానికి పాలు సరఫరా చేసేవారు, కేంద్రం అభివృద్ధికి కృషి చేసేవారిని ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో మహిళా పాడి రైతుల ఆర్ధికాభివృద్దికోసం అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ కార్యక్రమంనకు ప్రారంభం నుండీ జిల్లాలో మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రైవేట్ డైరీల పాల సేకరణ కేంద్రంలో కన్నా, జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రంలో వెన్న శాతం ఎక్కువగా నమోదు అవుతున్నదని పాడి రైతులు గుర్తించారన్నారు. సంఘ కార్యదర్శి పాల సేకరణకు సంబందించిన ప్రతీ అంశాన్ని రిజిస్టర్ లోను, ఆన్లైన్ లో నమోదు చేయవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి, ఎంపిపి గోగులమూడి శ్రీలక్ష్మి, తహసీల్దార్ జి. బాలకృష్ణారెడ్డి, , ఎంపిడిఓ వై. పిచ్చిరెడ్డి , పశు సంవర్ధక శాఖ ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వైద్య, ఆరోగ్య శాఖలో ఏడెనిమిది వేల ఖాళీల భర్తీకి మంత్రి ఆదేశం
-ప్రజలకు మెరుగైన సేవలకు డాక్టర్లు, పేరా మెడికల్ సిబ్బంది నియామకం అవసరమన్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీలపై మంత్రి సత్యకుమార్ …