నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు డివిజన్ లో ఫిబ్రవరి 14వ తేదీన 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగిరిపల్లి మండలంలో 2, ఏ. కొండూరు మండలంలో 1 కేసు నమోదయ్యాయన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
Prajavartha Online Telugu News