Breaking News

రూ.94వేల కోట్లకు లెక్క చెప్పాలి… : సాకే శైలజనాథ్

-రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగాధంలోకి నెట్టిన జగన్ రెడ్డి
-బడ్జెట్‌ అనుమతులు లేకుండా 94,399 కోట్లు ఏం చేశారు?
-కాగ్ నివేదిక పై శ్వేత పత్రం విడుదల చేయాలి – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ రెడ్డి అగాధంలోకి నెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. తట్టెడు మట్టి వేయకుండా… ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా… కోట్ల రూపాయల నిధులు ఏం చేశారో ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే వేలకోట్ల వ్యయం చేయడంపైన కాగ్ అసంతృప్తి వ్యక్తం చేయడం పై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.94 వేలకోట్లకు పైగా ఖర్చుచేశారని వెల్లడించడాన్ని చూస్తే ప్రభుత్వం ఎన్ని నిధులను దుర్వినియోగం చేసిందో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఈ మేరకు శైలజనాథ్ బుధవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు

9 నెలల రాష్ట్ర బడ్జెట్​ను పరిశీలించిన కాగ్ లోపాలను ప్రస్తావించిందని, రాష్ట్రంలో బడ్జెట్‌ అనుమతి (ప్రొవిజన్‌) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేశారని కాగ్‌ పేర్కొందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22)లో డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చేసిన మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్‌ అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తంచేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొనడాన్ని చూస్తే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నది అర్థమవుతుందన్నారు.

వివిధ ప్రభుత్వ విభాగాలకు రూ.వేల కోట్ల కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదని, బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఎంత కేటాయింపులు జరిపారు? ఎంత ఖర్చు చేశారు? రెవెన్యూ లోటు ఉందా? మిగులు ఉందా? ద్రవ్యలోటు ఉందా? వంటి అంశాలపై నివేదికలు ఇస్తారని, వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఏపీ ప్రభుత్వ ఖర్చులను పరిశీలించిన కాగ్‌ సంబంధిత నివేదికను వెల్లడించిన ఖర్చులు జరిగిన తీరును విశ్లేషించి అనేక లోపాలను గుర్తించిందని, ఎలాంటి బడ్జెట్‌ అనుమతి లేకుండానే దాదాపు 124 అంశాల్లో రూ.94,399.04 కోట్లను వివిధ ప్రభుత్వ శాఖలు ఖర్చు చేశాయని పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 947 అంశాల్లో బడ్జెట్‌లో కేటాయింపులకు మించి రూ.13,398.71 కోట్లు ఖర్చు చేశారని, బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.30,327.26 కోట్లను వివిధ విభాగాల కింద ఖర్చు చేసేందుకు ప్రతిపాదించి కనీసం పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబరులో రూ.3,250 కోట్లను మార్కెట్‌ నుంచి, రూ.81.11 కోట్లను కేంద్రం నుంచి రుణంగా తీసుకుందని, అదే నెలలో కేంద్ర రుణాలకు సంబంధించి పాత చెల్లింపులు చేసినా బహిరంగ మార్కెట్‌ రుణాలకు చెల్లింపులు జరపలేదన్నారు. ఇన్ని తప్పులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ లో కూర్చుని తమాషా చూస్తున్నారని శైలజనాథ్ ఆరోపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *