తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ హితం కాంక్షిస్తూ సంక్షేమ కార్యక్రమమలలో తమ వంతు సహకార మందిస్తున్న సీనియర్ సిటిజన్ల సేవలు అభి వందనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సోమవారం కవిరాజ పార్క్ లో సీనియర్స్ సిటిజన్స్ భవనంలో LV ప్రసాద్ నేత్రవైద్య సంస్థ సౌజన్యంతో మొవ్వా విజయలక్ష్శి ఉచితనేత్ర పరీక్ష కార్యక్రమనికి ఆయన మఖ్య అతిథిగా హాజరై కేవలం కంటి పరీక్షలే కాకుండా వారికవరసరమైన కళ్ళజోళ్ళు ఇతర సదుపాయాలు కల్పించటం హర్షణీయమన్నారు. తన సహథర్మచారిణి దివంగత శ్రీమతి మొవ్వా విజయలక్ష్శి సంస్మరణార్థం నిర్వహిస్తున్న కంటి వైద్య పరీక్షలలో 220 మందికి పైగా కంటిపరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్ళజోళ్ళు , కేటరాక్టు అవసరమైన వారికి ఉచిత కేటరాక్ట్ ఆపరేషన్లను చేయనున్నామని మొవ్వా సత్యనారాయణ తెలపారు. కేవలం తెల్లకార్డుదారులే కాకుండా సమాజంలోని వారు అందరూ ఇందుకు అర్హులే అని తెలిపారు. ఈకార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ ఖాలేదా నశీం వైస్ ఛైర్మన్ గుంటూరు కోటేశ్వరావు. 6వ వార్డు కౌన్సిలరు కొర్రపాటి లక్ష్శి , బొమ్మదేవర వేంకటెశ్వరరావు, కొర్రపాటి శ్రీనివాసరావు (TDP) రోటరీ క్లబ్ శక్రటరీ P.శివరామకృష్ట ప్రసాద్ , బూరెల దుర్గ కఠారి హరీష్ తదితరనాయకులు ఇందు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …