విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని సబ్ కలెక్టర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ నగరంలోని పాత, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తప్పవన్నారు. పేద ప్రజలు వైద్య సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత డాక్టర్లు వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నదని, ఆ దిశగా వైద్యులు సేవలు అందించాలని సబ్ కలెక్టర్ కోరారు. మహాప్రస్థానం వాహనాలను అన్ని వేళలా అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనం, డ్రైవర్ అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో వైద్య పరికరాలను ప్రతిరోజూ తనిఖీ చేసి సరిగా ఉన్నది లేనిది సరిచూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారి వివరాలను నమోదు చేయాలని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …