విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలవిభజనతో నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్ విజయవాడ జిల్లాకు తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం, అనుబంధంగా ఉండే వీడియోకాన్ఫరెన్స్ హాల్, మీనీమీటింగ్ హాల్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం, జాయింట్ కలెక్టర్ల కార్యాలయాలకు అవసరమైన భవనాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత, డిఆర్వో యం వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, ఆర్ అండ్బి ఎస్ఇ శ్రీనివాసమూర్తిలు పరిశీలించారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలలో అందుబాటులో ఉన్న వివిధ గదులను పరిశీలించారు. వాటిని నూతన కలెక్టర్ కార్యాలయానికి అనువుగా మార్పులు చేసేందుకు అధికారులకు కలెక్టర్ జె.నివాస్ పలు సూచనలు చేశారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయానికి అందుబాటులోనే జాయింట్ కలెక్టర్లు, డిఆర్వో కార్యాలయ ఛాంబర్లు, అనుబంధ సెక్షన్లు, వేచి ఉండే గదులు (వెయిటింగ్ హాల్స్), క్యాంప్ క్లర్కులు (సిసిలు) గదులు ఉండేలా మార్పులు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న ఛాంబర్, దానికి అనుబంధంగా ఉన్న కోర్టు హాల్ (వీడియోకాన్ఫరెన్స్ హాల్), ప్రధాన సమావేశ మందిరం, కార్యాలయానికి వెనుక భాగంలో ఉన్న రెవెన్యూ గేస్ట్ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న డివిజనల్ సర్వే ఇన్స్పెక్టర్ కార్యాలయం, ఫ్రీ లిటగేషన్ సెల్, ఖాళీగా ఉన్న ఇతర గదులను కలెక్టర్ పరిశీలించి ఛాంబర్లు ఏర్పాటు చేసేందుకు అనువుగా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …