Breaking News

“ఖేలో ఇండియా” పధకంలో భాగం గా ఆంధ్రప్రదేశ్ కి 13 సెంటర్లు మంజూరు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ఖేలో ఇండియా” పధకంలో భాగం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 సెంటర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ మంజూరు చేసినట్టు పర్యాటక, యువజన సంక్షేమం, సాంస్కృతిక, క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకుగాను ఒక్కోక్క సెంటర్ కు రూ ఏడు లక్షల రూపాయలను కేంద్రంమంజూరు చేసిందన్నారు. మంజూరైన నిధులతో అనుభవఙ్ఞుడైన ఒక్కోక్క కోచ్ ను నియమిస్తారని ఆయన తెలియజేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో క్రీడల శాఖ చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి అవంతి ఆ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఒక విధానాన్ని, చట్టాన్ని త్వరితగతిన రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్రీడ చట్టాన్ని రూపొందించి అమలుచేస్తే ఎంతోమంది క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని మంత్రి అవంతి వ్యక్తం చేశారు. దేశంలోనే క్రీడా చట్టాన్ని రూపొందించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలుమంజూరు కోసం కృషిచేయాలనిఆయన అధికారు లను కోరారు. అలాగే కొత్త ప్రతిపాదనలను సిద్దం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపించాలని మంత్రి అవంతి సూచించారు. ముఖ్యమంత్రి కప్ కు సంబంధించి ఇప్పటికే అయిదు జిల్లాలో క్రీడా పోటీలు జరిగాయని, మిగతా జిల్లాలో ముఖ్యమంత్రికప్ క్రీడా పోటీలు జరిగేటట్టు చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆటస్ధలాలు అభివృద్ధి, ఆయా జిల్లాలో క్రీడలశాఖ పనితీరుపైన ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడామండలి మేనేజింగ్ డైరక్టర్ ప్రభాకర్ రెడ్డి, శాప్ పరిపాలనాధికారి రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *