విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం(PC&PNDT) అమలు, పిల్లల ఆరోగ్య రక్షణ సమస్యలకు సంబంధించి స్థానిక హోటల్ లో శనివారం విజయవాడ డివిజన్ పరిధిలోని ఎంపిడివోలు, ఎండివోలు, మహిళా పోలీసులు, విద్యా కార్యదర్సులు, ఐసిడిఎస్ సి డి పివోలు & సూపర్‌వైజర్లు, వైద్య అధికారులు & సిబ్బందితో పి సి పి ఎన్ డి టి కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని అన్నారు. బాల్య వివాహాలను రద్దు చేయాలని, ప్రతి బిడ్డకు అభివృద్ధి చెందే హక్కు ఉందని, బిడ్డ పుట్టిన మొదటి 1000 రోజులు ఐసిడిఎస్ & ఆరోగ్య శాఖ ద్వారా పిల్లల సరైన అభిజ్ఞ వికాసానికి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ద్వారా అప్పుడే పుట్టిన నవజాత ఆడపిల్లల చేయి మరియు పాదాల ముద్రలతో ఫోటో ఫ్రేమ్ ఏర్పాటు చేయించి, ఆశా కార్యకర్త మరియు వైద్య సిబ్బంది నవజాత ఆడ శిశువు ఇంటివద్ద “ఘన స్వాగతం” పలికే కొత్త విధానాన్ని అమలు చేయటం జరుగుతుందని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. పిల్లల రక్షణ మరియు సమస్యల మీద పరస్పర అవగాహన కల్గి ఉండాలని ప్రోగ్రామ్ డైరెక్టర్ & వరల్డ్ విజన్ ఇండియా ఫ్రాన్సిస్ తంబి అన్నారు. ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పిసిపిఎన్డి టి చట్టం మరియు చైల్డ్ ప్రొటెక్షన్ సమస్యల గురించి అవగాహన కలిపించటం జరిగింది. ఈ అవహగాన కార్యక్రమములో అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ లు (ఎయిడ్స్ మరియు లెప్రసీ), డాక్టర్. ఉషా రాణి, డాక్టర్. ఇందుమతి, విజయవాడ డివిజన్ ఎసిపి దిశ, శ్రీ వివివి నాయుడు, డిప్యూటీ డి ఇ వో రవి కుమార్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డాక్టర్ నవీన్, నోడల్ ఆఫీసర్ ఆర్.ఆర్.టి శ్రీ. ఎన్ జోషి బాబు, ప్రోగ్రామ్ మేనేజర్ వరల్డ్ విజన్ ఇండియా పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …