Breaking News

భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, డబ్బు రికవరీ చేయాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ చేసే అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, టెండర్ కి విరుద్ధంగా నాసిరకం కన్నా తక్కువగా నాలుగో రకం సరుకులు సరఫరా చేస్తున్న అధికారులు స్టోర్స్ ను ఎందుకు తనిఖీ చేయడం లేదని ,కాంట్రాక్టర్ పై అధికారులు ఎందుకంత ప్రేమని, ఆరు నెలలకు తొమ్మిది కోట్ల రూపాయలు సదరు కాంట్రాక్టర్ కు చెల్లిస్తున్నారని అమ్మవారి హుండీ ఆదాయంలో ఇది 3/4 భాగమని, ఈ నాసిరకం సరుకులతో నే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారని భక్తులకు ప్రసాదాలు అందజేస్తారని అటు అమ్మవారికి అపచారం చేస్తూ ఇటు భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సదరు కాంట్రాక్టర్ పై ఎండోమెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పాలకమండలి, ఈవో  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సమాధానం చెప్పాలని, గత సంవత్సరం ఇదే రోజున పచారీ సరుకుల కాంట్రాక్టర్ పై విలేకరుల సమావేశం పెట్టి వాస్తవాలు తెలియజేశానని, సంవత్సరం తర్వాత ఈ రోజున సాక్షి పేపర్లో పూసగుచ్చినట్టు పచారి సరుకులు కాంట్రాక్టర్ చేసే అక్రమాలు నాసిరకం సరుకుల సరఫరా పై పూస గుచ్చినట్లు వివరించారని, దీన్నే దేవుడి స్క్రిప్ట్ అంటారని, సాక్షి పేపర్ లో అక్రమాలపై వచ్చిన ఆర్టికల్ పై వైఎస్ఆర్సిపి నాయకులు ఏం సమాధానం చెబుతారని, మాపై పనికిమాలిన ప్రెస్ మీట్ లు పెట్టడం మాని, ఈ అవినీతి పై వైఎస్సార్ సీపీ నాయకులు దమ్ముంటే స్పందించాలని, అమ్మవారికి భక్తులు సమర్పించే ముడి బియ్యాన్ని ఈ కాంట్రాక్టర్ లిక్కర్ తయారు చేసే కంపెనీ లకు కంచికచర్ల మరియు నంద్యాల కంపెనీ లకు అమ్మడం వాస్తవం కాద అని, ఇంతకన్నా గోరా అపచారం మరి ఏమి ఉంటుందని, 2018 లో ఈ కాంట్రాక్టర్ జీడిపప్పు సరఫరా చేస్తానని కేజీ ₹250 కి టెండర్ దాఖలు చేసి టెక్నికల్ గా తప్పు పడిందని టెండర్ రద్దు చేసుకొని రెండవ కాంట్రాక్టర్ కేజీ జీడిపప్పు 650 రూపాయలకు సరఫరా చేసే విధంగా సహకరించడం వలన అమ్మవారి ఆలయానికి కోటి 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అందువల్ల ఇతని వద్ద నుంచి ఆ డబ్బు మొత్తం వసూలు చేయాలని, పచారీ సరుకుల సరఫరా లో లెక్కలేనన్ని అవకతవకలకు పాల్పడుతున్న ఈ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, డబ్బు రికవరీ చేయాలని ఇతనిపై ఎండోమెంట్ కమిషనర్ గారు విజిలెన్స్ అధికారులు ఆలయ ఈవో పాలకమండలి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చర్యలు తీసుకోకపోతే ఉగాది తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారి భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా టెండర్ లో చూపించిన సరుకులు ఎందుకు స్టోర్ లోకి ఎందుకు రావట్లేదో అధికారులు కనీసం తనిఖీ చేయడం లేదంటే ఇతని వద్ద నుంచి ఏమి ఆశిస్తూ ఆలయ ఉద్యోగులు కళ్లుమూసుకుని విధులు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని, అందరినీ మోసం చేసే విధంగా బాక్సుల్లో నాణ్యమైన సరుకులు చూపిస్తూ స్టోర్స్ లో మాత్రం నాసిరకం కన్నా దిగువ స్థాయిలో ఉన్న సరుకుని వినియోగిస్తున్న అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారో సమాధానం చెప్పాలని ,అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలోనే ఉండే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సదరు కాంట్రాక్టర్ పై అంత ప్రేమ ఎందుకు సమాధానం చెప్పాలని ఇంటి ముందున్న ఆలయంలో జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేయలేని అసమర్ధ స్థితిలో ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఏమనాలో వైఎస్ఆర్సిపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *