విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో అత్యధికంగా ఉన్న కొండ ప్రాంతంలో నివసించే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు, మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వాటర్ ట్యాంక్ లు,పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్, క్రిస్తురాజుపురం కొండ ప్రాంతంలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ కలాపాల అంబేద్కర్ ఆధ్వర్యంలో దాదాపు 42లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న డివిజన్ల లలో అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.అదేవిధంగా 5వ డివిజన్ లో మంచినీటి ట్యాంక్ నిర్మాణం కూడా మొదలుపెట్టారు అని అది వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు అభివృద్ధి పనులు లతో వైస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు పోతుందని,రాబోయే 30 సంవత్సరాలు జగన్ గారే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక,7వ డివిజన్ కార్పొరేటర్ మాధురి,కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు 5వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు విఠల్ ,లోకేష్,లామ్ కిరణ్,రమేష్,సోజన్య,శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …