విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
46వ డివిజనులోని మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ – వి కన్వెన్షన్ లో మంగళవారం అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో 200 మంది పేద ప్రజలకు నిత్యవసర సరుకులు (రేషన్ కిట్) పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భాములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అక్షయ ఫౌండేషన్ వారు చాలా ప్రాంతాలలో పెట్టడం జరిగినది. ముఖ్యముగా 46వ డివిజన్ లో ప్రజలకు నిత్య అవసరాలు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో అక్షయ ఫౌండేషన్ వారు 9 రకముల పదార్ధాలు కలిగిన కిట్ మేయరు గారి చేతుల మీదగా పేద ప్రజలకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమము లో రాయన నరేంద్ర గారు, స్థానిక ప్రజలు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
-తద్వారా వాటి పనితీరు మెరుగుపరుద్దాం -సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేలా పనిచేయండి -త్వరలో అందుబాటులోకి …