-నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్షించిన దేవాదాయ, ధర్మదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మేయరు రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఛాంబర్ నందు నిర్వహించిన సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్ కమీషనర్ పి.రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఇందులో ప్రధానంగా వంద కోట్లు రూపాయల అంచనాలతో చేపట్టి పెండింగ్ ఉన్న పనులు వెంటనే పూర్తి చెయ్యాలని ఆదేశించారు. అదే విధంగా విద్యాదరాపురం నందు స్టేడియం నిర్మాణమునకు సంబందించిన వర్క్ ఆర్డర్ పనులు కూడా వేగవంతం చేసి సత్వరమే పూర్తి చెయ్యాలి అన్నారు. అదే విధంగా 40వ డివిజన్ లారీ స్టాండ్ దగ్గర గో- కార్టింగ్ వర్క్ పనులు వెంటనే పూర్తి చేయాలని మరియు లారీ స్టాండ్ తరలించుటకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. కృష్ణ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో ఇప్పటికి రూ.20 లక్షలతో మొదలు పెట్టడం జరిగినది దానితో పాటుగా అదనంగా మరొక 80 లక్షలు మంజూరు చేసి ప్రణాళిక ప్రకారం అన్ని పనులు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గం పరిధిలో గల అన్ని మేజర్ అవుట్ ఫాల్ డ్రైయన్ లలో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టి వేసవి కాలం పూర్తి అయ్యేలోపుగా సిల్ట్ పనులు పూర్తి చేయునట్లుగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు.