విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు, రేపు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో 3000 APCOS వర్కర్లు ఈ రోజు సమ్మెలో పాలోగోన్నప్పటికి కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల ప్రకారం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి అందుబాటులో వున్న 610 పారిశుధ్య కార్మికులతో 250 CNG ఆటోలతో 36 కంపాక్టర్ వాహనాలతో నగరంలోని అన్ని ప్రధాన రహదారులు CM గారి రూట్ చక్కటి ప్రణాళికతో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్ వైజర్స్, AMOH, 4 గురు టీం వర్క్ తో ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారిశుధ్య సేవలు అందించినారు. రేపు కుడా ఇదే విధంగా ప్రజలకు సేవలు అందజేస్తారు. మరికొంత మంది కార్మికులు తమ విధులకు హాజరవుతారని భావిస్తున్నారు. రేపటి సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మంచి పారిశుద్ధ్య సేవలందించేందుకు రేపటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …