Breaking News

అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని అమలు పరచాలి…

– పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని అమలు పరచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సురేష్ కుమార్  అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విద్యాహక్కు చట్టం రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుల తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీ.వో.ఆర్టీ. నం 21 (తేదీ 7.2.2022) ప్రకారం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి  బుడితి రాజశేఖర్ చైర్మన్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రైవేటు పాఠశాలల అసోషియేషన్ తరఫున ప్రతినిధులు మరియు ఎన్జీవోలు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1)(సి)ని తప్పకుండా అమలు చేస్తామని అంగీకరించినట్లు తెలిపారు. ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చుకు సంబంధించి నిర్ణయాలపై కమిటీ కూలంకషంగా చర్చలు జరిపిందని అన్నారు. తర్వాత సమావేశానికి సలహాలు, సూచనలు రాతపూర్వకంగా అడగడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక శాఖ తరఫున అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి , ఎన్జీవోలు, మిగతా కమిటీ సభ్యులు, పాఠశాల విద్యాశాఖ సంబంధించి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *