విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆశిస్సులతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పురస్కారాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు చదువుకోడానికి, ఆర్థిక పరంగా ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గత కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమ కార్యాచరణ తెలుపుతూ బ్రాహ్మణ అభివృద్ధికి తమ సంఘ అభివృద్ధికి మరిన్ని ఆలోచనతో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి సహాయ సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన 67 మందికి ఉగాది పురస్కారాలు పొందినవారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ శారదా పీఠం ఉత్తరాదికారి స్వాత్మా నరేంద్ర స్వామి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రవచన కర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, తిరుమల ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రమణ దీక్షితులు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ వరప్రసాద్, సురేష్, కోశాధికారి పి పురుషోత్తమ శర్మ, గుండవరపు అమరనాథ్, పరసా రవి, పివీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …