-ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ
-కమీషనర్ శ్రీ. స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఎ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2022-2023ఆర్ధిక సంవత్సరానికి గాను చెల్లించే ఆస్తి పన్నులపై 5 శాతం రిబేటు ఇస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఎ.ఎస్. తెలిపారు. ఈ నెల 30 తేది లోపు ఇంటి యజమానులు తమ ఆస్తి పన్నును చెల్లిస్తే రిబేటు ఉంటుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ 9 కౌంటర్ లలో పన్నులను చెల్లించ వచ్చునన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ కోరారు.