ముఖ్య అతిధులు మీరే.. వాలంటీర్ల సన్మాన సభలో కలెక్టర్

-కోవిడ్ సంక్షోభ సమయంలో మీ సేవలు నిరూపమానం… డా. మాధవీలత

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అందచేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో వాలంటీర్లు సేవలు నిరూపమానం అని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం నల్లజర్ల లో గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వాలంటీర్లు జ్యోతి ఫంక్షన్ హాల్లో జరిగిన అవార్డు ప్రథానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో , అగ్రగామిగా నిలపడం లో క్షేత్రస్థాయిలోని సచివాలయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. కోవిడ్ సమయంలో ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులను అందించడం, ప్రజా ఆరోగ్య సర్వే చెయ్యడం, మందులు పంపిణీ వరకు ప్రతి అడుగులోను ముందు నిలిచారన్నారు. ఈరోజు ముఖ్య అతిధులు వలంటిర్లే, ప్రభుత్వ పథకాలను వేగవంతం అర్హులైన వారందరికి చేరవేయడం లో వాలంటీర్లు కీలకపాత్ర పోషించారన్నారు. పరిపాలన వ్యవస్థ గ్రామ, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని డా.మాధవీలత తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థ నేడు శాశ్వత భవనాల్లో ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించిందన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో సేవా వజ్రా/ రత్న/ మిత్ర అవార్డు లకు ఎంపికైన 1230 మందికి రూ.18 లక్షలు నగదు ప్రోత్సాహకాలు అందించి, వారి సేవాలకు మరింత గుర్తింపు నిస్తున్నామన్నారు.

అవినీతికి తావులేకపోవడం, సచ్చీలత, ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన పేద, నిరుపేద లకు పెన్షన్ల మంజూరు , ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో వాలంటీర్ ల సేవలను గుర్తింపు నివ్వడం జరిగిందని శాసన సభ్యులు తలారి వెంకట్రావు పేర్కొన్నారు. ఇంటింటికి పెన్షన్లు పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర అంశాల్లోవారి పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పనితీరుకు గుర్తింపు నివ్వడం జరుగుతోందన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో మొత్తం 1230 మందికి సేవ వజ్ర..5, సేవా రత్న 20 , సేవామిత్ర ..1205 మందికి అవార్డులు అందచేశారు. కేటగిరీలు వారీగా సేవా వజ్ర అవార్డ్ గ్రహీత లకు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి అందచేశారు. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దేవరపల్లి మండలం పి. సురేష్, ద్వారకాతిరుమల కు చెందిన డి. జాన్ పాల్, డి.దేవి, గోపాలపురం కి చెందిన బి. స్వామీ, నల్లజర్ల కి చెందిన టి. సంధ్యారాణి లకు సేవా వజ్ర అవార్డ్ లు అందచేశారు. సేవా రత్న అవార్డ్ కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి అందచెయ్యగా నియోజకవర్గంలో మండలానికి ఐదుగురు చొప్పున 20 మందికి , సేవా మిత్ర అవార్డు గ్రహీత లకు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతిగా 1205 మంది వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డుల ప్రధానంచేశారు. నల్లజర్ల లో 315, గోపాలపురం లో 231, దేవరపల్లి లో 285, ద్వారకాతిరుమల లో 374 మందికి సేవా మిత్రా అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకల్లో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జెడ్పీ టిసి లు కె.లలిత, పి. స్వర్ణలత, ఎమ్.లక్ష్మీ, ఎంపిపి బి. జయలక్ష్మి, యు. సత్యనారాయణ, కె. దుర్గారావు, బి. మోహిని లు, ఎంపిటిసిలు సిహెచ్. శ్యాముల్, ఏఎం సి ఛైర్మన్ జి. జనార్దన్ రావు, ప్యాక్ ఛైర్మన్ కె. రమేష్, ఎంపీడీఓ లు, తహశీల్దార్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *