విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన డిల్లీ రావు జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో మారిన పరిస్ధితులను గురించి వివరించారు. పూర్వపు కృష్ణా జిల్లాను విభజించి విజయవాడ కేంద్రంగా కొంత భాగాన్ని ఎన్ టి ఆర్ జిల్లాగా ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు క్షేత్ర స్ధాయికి చేరేలా జాగ్రత్త వహించాలన్నారు. చిన్న జిల్లాలతో మెరుగైన పాలనా సౌలభ్యం తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …