-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజక వర్గ పరిధిలో 17వ డివిజన్ నందు సుమారు రూ. 10 లక్షల అంచనాలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి ఆధునీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయరు బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో కలసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగరంలోని అన్ని డివిజన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో డివిజన్ పర్యటనలో గుర్తించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థకు సంబందించి రోడ్ కంటే పల్లంగా ఉన్నదా మ్యాన్ హోల్స్ లను ఎత్తు పెంచుట మరియు పాడైన మూతల మార్పిడి వంటి పలు పనులకు శ్రీకారం చుట్టి అండర్ గ్రౌండ్ డ్రెయినేజి సమస్యలను పరిష్కరించుట జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎదురౌతున్న సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ సిద్దంగా ఉందని తెలియజేసారు.
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా వై.సి.పి పాలన
తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్
ప్రజా సమస్యల పరిశీలనలో భాగంగా డివిజన్ స్థాయిలో స్థానిక కార్పొరేటర్లు మరియు ప్రజలు తెలిపిన సమస్యలను మేయర్ గారికి మరియు సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించేలా తన వంతు కృషి చేస్తున్నాని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, అనేక సంక్షేమ పథకముల ద్వారా ప్రజల అవసరాలను తీర్చుటలో రాష్ట్ర ప్రభుత్వం మరియు నగరపాలక సంస్థ అందించు మౌలిక సదుపాయాలలో ఎదుర్కోను ఇబ్బందులను పరిష్కరించుటలో మేయర్ తోడ్పాటుతో అధికారుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, స్థానిక వై.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News