మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడంతో పాటుగా మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని బోయపాటి మాధవరావు స్కూల్ గ్రౌండ్ నందు జరిగిన ‘వైయస్సార్ సున్నా వడ్డీ’ పధకం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి, 8వ డివిజన్ ఇంచార్జి కొత్తపల్లి రజని, 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్ము కలిసి ముఖ్య అతిథిగా అవినాష్ పాల్గొని 7, 8, 19 డివిజన్ల సంబంధించి 312 మహిళ సంఘాలకు లబ్ది చేకూరేలా రూ.5028501 నిధులను విడుదల చేసారు. డ్వాక్రా అక్కచెళ్ళమ్మలకు సున్న వడ్డీ పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ వైస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నారని దానికనుగుణంగా నేడు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వైసిపి అధికారం చేపట్టిన మూడు సంవత్సరాలనుండి డ్వాక్రా మహిళలకు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు 3వందల 80 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం మహిళకు 3 వేల 5 వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతికి పాటు పడుతున్నారని ఈ క్రమంలో జగన్ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు తనకు అనుకూలంగా ఉన్న పత్రిక ను వాడుకుంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే మన రాష్ట్రం శ్రీలంకల మారుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ముఖ్యంగా పెట్టుబడులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. టిడిపి నాయకులకు 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో హుందాగా ఉండాలని లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు రాజ్ కమల్, సంపత్, క్లైవ్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *