-పారిశుధ్య వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలి… : శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశుభ్రత వారోత్సవాల కార్యక్రమములో 4వ రోజు ఆదివారం 64 డివిజన్ లలో డ్రైయిన్ లలో సిల్ట్ తొలగించడం, పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ IAS ఆదేశాల మేరకు చీఫ్ మెడికల్ అధికారి డా. గీతభాయి సూచనలకు అనుగుణంగా ప్రజారోగ్య అధికారులు మరియు సిబ్బంది టీమ్ వర్క్ తో పరిశుభ్రత వారోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పస్తూ రోడ్లపై మరియు డ్రైయిన్ లలో చెత్త మరియు వ్యర్థములు పాడవేయకుండా ఇంటి పరిసరాలు అన్నియు శుభ్రం ఉంచుకోవాలని అన్నారు
1వ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్ నందు ఏర్పాటు చేసిన సుందర హరిత విజయవాడ, పరిశుభ్రత కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని మొక్కలు నాటారు. అదే విధంగా 64 వార్డు లలో ఆయా డివిజన్ కార్పొరేటర్లు, స్పెషల్ అపిసర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రెటరీలు, సచివాలయ అడ్మిన్లు, సెక్రెటరీలతో పాటుగా వాలంటీర్లు పాల్గొన్నారు. 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర రావు (చంటి) పారిశుధ్య వారోత్సవాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, తాను వాడుకోను మోటార్ బైక్ వాహనమునకు పరిశుభ్రత వారోత్సవాలు స్టికర్ ఏర్పాటు చేసుకొని వార్డులోని ప్రజలకు హ్యాండ్ మైక్ ద్వారా పరిశుభ్రత మీద అవగాహన కలుగచేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమములో డిప్యూటీ మేయర్లు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రజారోగ్య ఆధికారులు, శానిటరి సూపర్ వైజర్లు ,శానిటరి ఇన్స్పెక్టర్లు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News