Breaking News

జాతీయజెండా 100 సంవత్సరాల వేడుకలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయజెండా పతాక ప్రదాత స్వర్గీయ పింగళి వెంకయ్యచే రూపుదిద్దుకొని 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా మరియు జాతీయ పతాకాన్ని మే 1వ తేదీన జాతీయ స్ఫూర్తి పతకంగా గుర్తించిన రోజుని గౌరవించే దిశగా, ఆదివారం గాంధీనగర్‌ జింఖానాగ్రౌండ్స్‌ విజయవాడ వేదికగా ప్రజాపతి నేషనల్‌ ట్రస్ట్‌ యాంతమ్‌ ఫ్లాగ్‌ ట్రస్ట్‌ అండ్‌ సొసైటీ మరియు నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సంయుక్త ఆధ్వర్యంలో శతవసంతాల ఫ్లాగ్‌ డే గౌరవ వందనం కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో అనేకమంది ప్రముఖులు, ఎన్‌హెచ్‌ఆర్‌సి నేషనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సంపత్‌ కుమాం, క్రిష్ణ కిషోర్‌, కందుల చందు, ఎపి రాష్ట్ర అధ్యక్షులు వి.వి.రామ కృష్ణారెడ్డి, సుధాకర్‌నాయుడు, అమీన్‌భాయ్‌, అజయ్‌, జయలక్ష్మి, ఆసిఫ్‌, జగన్‌మోహన్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎన్‌హెచ్‌ఆర్‌సి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రాష్ట జాయింట్‌ సెక్రటరీగా అమీన్‌భాయ్‌ని నియమించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *