సన్మార్గ జీవనానికి రంజాన్ బాటలు వేస్తుంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి రంజాన్ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానా నందు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రార్థనలలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. ముస్లింలు మైనార్టీలు కాదు మెజార్టీలని 4 శాతం రిజర్వేషన్ తో వారి అభ్యున్నతికి బాటలు వేసిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేలా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజ‌ల మ‌ధ్య ఉన్న‌ మ‌త‌సామ‌ర‌స్యాన్ని దేశానికి చాటి చెప్పే విధంగా ఇటీవల ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఇఫ్తార్ విందును ప్రభుత్వం ఘ‌నంగా నిర్వహించినట్లు వెల్లడించారు. కానీ కొన్ని దుష్టశక్తులు ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని.. అటువంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. లౌకికవాద విఘాత శక్తులకు రాష్ట్రంలో స్థానం లేదని.. అటువంటి వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్.కె.నాగూర్, షేక్.రసూల్, రషీద్, నాయకులు అఫ్రోజ్, అవుతు శ్రీనివాసరెడ్డి, నజీర్ ఖాన్, శివ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *