వృద్ధుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 14567

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్ హెల్ప్ లైన్ 100 , చైల్డ్ లైన్ 1098 , ఎలాగోవృద్ధుల కొరకు 14567 హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే వృద్దులకు అండగా నిలవడం జరుగుతుందని డిఆర్వో బి. సుబ్బారావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విభిన్న ప్రతిభావంతుల శాఖ ఈస్ట్, వెస్ట్ ఫీల్డ్ రెస్పాన్సిబుల్ అధికారి ఎం.పుష్పాంజలి తో కలిసి డి ఆర్వో పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్భంగా డి ఆర్వో మాట్లాడుతూ, పిల్లలు కొందరి వృద్ధులు పట్ల నిర్లక్ష్యం చేయడం నేడు చూస్తున్నామని, అటువంటి వృద్దులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఈ హెల్ప్ లైన్ తన సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉందన్నారు. వృద్ద ఆశ్రమాలు, సంరక్షణ కేంద్రం, కార్యాచరణ కేంద్రాలు, ఆసుపత్రుల వివరాల సమాచారం కోసం సహాయకారిగా ఈ హెల్ప్ లైన్ సేవలు అందిస్తుందని తెలిపారు. పర్యవేక్షణఅధికారి ఎం.పుష్పాంజలి మాట్లాడుతూ వృద్దులకు భరోసా ఇచ్చే దిశగా హెల్ప్ లైన్ సేవలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మద్దుల పుష్పాంజలి తదితరులున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *