-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్ధుల సహాయం కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో వృద్ధుల హెల్ప్ లైన్ పోస్టర్ ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ హెల్ప్ లైన్ , చైల్డ్ లైన్ విధానంలో వృద్ధుల కొరకు 14567 హెల్ప్ లైన్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మన భవిష్యత్తు కోసం, మన తల్లి తండ్రులు అభివృద్ధి కోసం గత వృద్దులు చేసిన త్యాగాలు మరవరాదన్నారు. వృద్ధులు పట్ల నిర్లక్ష్యం తగదని, అటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై శిక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు. , వృద్దుల పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తుడడంఅభినందనీయం అన్నారు. పాశ్చాత్య పోకడలకు లోనై వృద్ధులను నిర్లక్ష్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ హెల్ప్ లైన్ అందించే సేవలలో వృద్ద ఆశ్రమాలు వివరాలు. సంరక్షణ కేంద్రం వివరాలు, ఆసుపత్రుల వివరాల సమాచారం కోసం హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి సేవలు పొందవోచ్చునని తెలిపారు. వృద్దులకు భరోసా ఇచ్చే దిశగా హెల్ప్ లైన్ సేవలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి ఎం.పుష్పాంజలి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మద్దుల పుష్పాంజలి తదితరులున్నారు.
Prajavartha Online Telugu News