గుణదల రోడ్డు ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం పనులు పూర్తి చేయండి…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల రోడ్డు ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ నుండి బుధవారం గుణదల ఆర్‌వోబి నిర్మాణ ప్రగతి పై శాసన సభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, నగర పాలక సంస్థ మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ ఆర్‌ శ్రీనివాస్‌ముర్తి, తహాశీల్థార్‌ దుర్గాప్రసాద్‌లతో జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గుణదల ఆర్‌ఓబి నిర్మాణ ప్రస్తుత ప్రగతిని సమీక్షించి 15 రోజుల్లో ఆర్‌ఓబికి సంబంధించిన అన్ని స్థాయి అడ్డంకులను అధిగమించాలన్నారు. నిర్మాణానికి సంబంధించి పెండిరగ్‌లో ఉన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. న్యాయ స్థానాల్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణానికి సంబంధించి మొదటి దశలో 2,550చ.మీ. భూసేకరణ పూర్తి చేసి రూ.2 కోట్ల 10 లక్షలు నష్టపరిహారంగా అందించారన్నారు. రెండవ దశలో 22 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం అవార్డు స్టేజ్‌ వరకు వచ్చిందని మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆర్‌ఓబిని వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. నగర వాసులకు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు హైదరాబాద్‌, విశాఖపట్నం వైపు నుండి నున్న మీదుగా నూజివీడు వెళ్లెవారికి గుణదల ఆర్‌ఓబి ప్రయోజనం చేకూరుతుందన్నారు. గుణదల ఆర్‌ఓబి పూర్తి అయితే కొంత వరకు ట్రాఫిక్‌ ఇబ్బందులు పరిష్కరం అవుతాయని ఇందుకు సంబంధించి రెవెన్యూ ఆర్‌అండ్‌బి అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌ మాట్లాడుతూ గుణదల ఆర్‌ఓబి నిర్మాణం ఎప్పుడో పూర్తి కావలసి ఉందని ఈ ప్రాంతంలో మూడు బ్రిడ్జిలు, మూడు కాలవలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రద్దీ వుంటుందని నిత్యం 10 వేల మంది రాకపోకలు జరుగుతాయన్నారు. వీరు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి గౌరవ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా గతంలోనే ఆర్‌ఓబి నిర్మాణానికి 23 కోట్లు మంజూరు చేస్తూ జివోను కూడా విడుదల చేశారన్నారు. స్టేజ్‌ `1లో భూ సేకరణ పూర్తి చేయడం జరిగిందన్నారు. గుణదల ఆర్‌ఓబిని త్వరితగతిన పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *