విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ బుధవారం పదవీబాధ్యతలు చేపట్టిన పల్లేటి రాజబాబుకు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు యం రాజుబాబు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం యంఐజి ప్రత్యేక అధికారిగా మరియు ఆంధ్రప్రదేశ్ అర్భన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపియుఎఫ్ఎడిసి) యండిగా బాధ్యతలను నిర్వహిస్తున్న పి.రాజబాబును రవాణాశాఖ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయవాడ ఆర్టిసి బస్టాండ్ ఆవరణంలోగల ఎన్టీఆర్ పరిపాలన భవనంలోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో పి. రాజబాబు పదవీబాధ్యతలను స్వీకరించారు. కమీషనర్ పి రాజబాబును జోనల్ ఉద్యోగలు సంఘ అధ్యక్షులు యం రాజుబాబు మర్యాదపుర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ
-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …