విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారంలేకుండా పారదర్శకమైన సేవలు అందించడం అభినందనీయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరరెక్టర్ జనరల్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారిదర్శకమైన పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి (ప్రభుత్వాన్ని)ని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరా అభినందించారు. తొలుత జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రసాదంపాడు, గూడవల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలలో సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరరెక్టర్ జనరల్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరా,ఏపిస్టేట్ హ్యుమన్‌రైట్స్ సభ్యులు డా. జి శ్రీనివాసరావులు సచివాలయ వ్యవస్థ పనితీరుపై అధ్యయనం చేసేందుకు సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాతీయ మానవ హక్కుల కమీషన్ డైరెక్టర్ జనరల్‌కు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న వివిధ శాఖల వారి పనితీరును వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను బృందానికి తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్వవస్థను తీసుకువచ్చి, అవినీతికి వివక్షతకు తావు లేకుండా పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500లకు పైగా సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ బృందానికి వివరించారు. ఫింఛన్, రెషన్ కార్డు, ఇంటిపట్టాలు, తాగునీటి సరఫరా సమస్య, సివిల్ పనులకు సంబంధించిన పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్టీ రంగాల సేవలు వంటివి ఎన్నో గ్రామ సచివాలయాల్లో ఆర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అన్ని పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరువ చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశమని కలెక్టర్ అన్నారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని కలెక్టర్ బృందానికి స్పష్టం చేశారు.సచివాలయ వ్వవస్థలో వాలంటీర్ల వ్యవస్థ ప్రధాన ప్రాత పోషిస్తుందని అర్హులైన ప్రతి లబ్దిదారుని గడపకు వెళ్లి స్వయంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వివరించారు. కుల మత పార్టీలు వర్గాలకు అతీతంగా ప్రతి లబ్దిదారునికి సంక్షేమ పథకాలు అందజేయడం వాలంటీర్ల బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు లబ్దిపొందలేని వారిని గుర్తించి వారితో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చే విధంగా వాలంటీర్ల వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని తెలుసుకున్నారు. సచివాలయంలో గ్రామ/వార్డు కార్యదర్శి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరిస్తారని రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామసర్వేయర్లు, వీఆర్వోలు, పనిచేస్తారని, రైతులకు సేవలు అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్యశాఖ సచివాలయ ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషిస్తారని సంక్షేమ పథకాలు అమలు పట్ల పూర్తి బాధ్యత వెల్పేర్ అసిస్టెంట్‌కు ఉంటుందని తెలిపారు. మహిళల భద్రత కోసం మహిళా పోలీసులు, వైద్యం ఆరోగ్య సేవలు అందించేందుకు ఏఎన్‌ఎంలు, సచివాలయ పరిధిలో ఇతర సేవల కోసం డిజిటల్ అసిస్టెంట్లు, ఇలా ప్రజలకు అన్ని విధాలుగాను సచివాలయ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ జనరల్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరా బృందానికి వివరించారు.
అభిప్రాయం
ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలను ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలని, సచివాలయ వ్యవస్థ పనితీరు బేష్ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరా అన్నారు.
దిశ యాప్ ను చరవాని ద్వారా జాతీయ హ్యుమన్ రైట్స్ కమీషన్ డైరెక్టర్ జనరల్ (ఇన్వ్‌స్టిగేషన్) సంతోష్ మెహరా స్వయంగా పరిశీలించారు. దిశ యాప్‌ను ఆయన ఉపయోగించగానే మంగళగిరిలోని దిశ కంట్రోల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందుకుని స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ చరవాణిలో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 3.70 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం అభినందనీయమన్నారు. అయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సేద్యంలో మెళుకువలు తెలుసుకొని వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగివుండాలని అన్నారు.
ఈ పర్యటనలో ఏపిస్టేట్ హ్యుమన్‌రైట్స్ సభ్యులు డా. జి శ్రీనివాసరావులు జడ్పిసిఇవో పి ఎస్ సూర్యప్రకాష్, డ్వామా పిడి జె. సునీత, డిపివో కె.పి.చంద్రశేఖర్ ఉన్నారు.