Breaking News

స్పందన వేదికను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి…

-స్పందనలో 92 ఆర్జీల నమోదు..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు కోరారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా కార్యాలయాల వద్దకు వెళ్లకుండా అన్ని శాఖాల జిల్లా అధికారులు స్పందన కార్యక్రమంలో ఒకే వేదికపై ఉండి ప్రజా సమస్యలను పరిష్కరింప చేసేందుకు అందుబాటులో ఉంటారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
స్పందనలో నమోదైన ఆర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని అక్కడికక్కడే ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆర్జీదారుడు సంతృప్తి చేందే విధంగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచిస్తూ, ఒక్కసారి పెట్టుకున్న ఆర్జీలు మరల తిరిగి రాకుండా వీలైనంత మేరకు ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అన్నారు. భూ తగాదాలకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ అధికారులు తక్షణమే పరిష్కరించాలని, పెన్షన్‌, ఇళ్లపట్టాల ఆర్జీలను పరిశీలించి అర్హత మేరకు పెన్షన్‌ ఇళ్లపట్టాలను మంజూరు చేయాలని కలెక్టర్‌ అన్నారు.
స్పందనలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 40, మున్సిపల్‌ ఎడ్మినిట్రేషన్‌ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ 4, పోలీస్‌ శాఖకు.16, విద్య శాఖ 5, పంచాయతీరాజ్‌ శాఖకు 3, సర్వే మరియు సెటిల్మింట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డు 3, మిగిలినవి వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయన్నారు.

స్పందనలో ప్రధానంగా నమోదు అయిన ఆర్జీలు
విజయవాడకు చెందిన తిమ్మసర్త్తి నాగేశ్వరరావు ఆర్జీ ఇస్తూ తన ఎలక్ట్రికల్‌ సర్వీస్‌ మీటర్‌ సక్రమంగా పనిచేయడం లేదని మీటరు రీడిరగ్‌ తీయటానికి వచ్చిన వ్యక్తి రీడిరగ్‌ను ఎక్కువగా నమోదు చేసుకుని గత 4 నెలల నుండి తప్పుడు రీడిరగ్‌ బిల్లులు ఇస్తున్నారని, సక్రమంగా లేని విద్యుత్‌ సర్వీసు, మీటర్‌ స్థానంలో కొత్త ఎలక్ట్రికల్‌ మీటర్‌ను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.
విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన మల్లాది చిట్టియ్య ఆర్జీ ఇస్తూ తనకు వారసత్వంగా ఇచ్చిన భూమిని వ్యవసాయం చేసుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించారని వారికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని దీనిపై విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని కోరారు.
విజయవాడ వించిపేటకు చెందిన గరికపాటి వసుందర ఆర్జీ ఇస్తూ తనకు గతంలో టిట్కో స్కీమ్‌లో గృహం మంజూరు అయిందని, 25 వేల రూపాయల నగదు చెల్లించానని అయితే ఆ ఇంటిని ఇవ్వకుండా స్థలం ఇచ్చారని తనకు ఆ స్థలం అవసరం లేదని టిట్కో స్కీమ్‌లోని ఇంటిని మాత్రమే మంజూరు చేయవలసిందిగా కోరారు.
విజయవాడకు చెందిన విభిన్నప్రతిభావంతుడైన మేనక తామస్‌ ఆర్జీ ఇస్తూ తన కుటుంబ పోషణ కష్టంగా ఉందని తనకు సొంత గృహం కూడా లేదని ఏదైన వ్యాపారం చేసుకుని జీవించడానికి త్రిచక్ర వాహనాన్ని ఇప్పించవలసిందిగా కోరారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ కుమార్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్

-19 మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో దాడులు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *