విద్యుత్ రంగంలో దేశ ప్రగతిపై భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలు….

-ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య వేడుకలు – 2047
-నగరంలో గోదారి తీరంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలల్లో – బిజిలీ మహోత్సవ్
-జూలై 26 న దివాన్ చెరువు ప్రాంతంలో వేడుకలు ప్రారంభం
-కొవ్వూరు లో మధ్యాహ్నం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి తానేటి వనిత హాజరు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వరాజ్యం సిద్ధించి 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవాలను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిష్టాత్మకంగా గోదావరితీరంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణ అధికారి టి.వి.యస్.ఎన్ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల జూలై 26 నుంచి 30వరకూ ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య పేరుతో నిర్వహించే కార్యక్రమాల వివరాలను జిల్లా నోడల్ అధికారి యు.శ్రీనివాస్, రాజమహేంద్రవరం డివిజన్ పర్యవేక్షణ అధికారి నక్కపల్లి శ్యాముల్ లు వెల్లడించారు.

స్వతంత్ర భారతావనిలో విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక పరిణామాలను ప్రజలకు వెల్లడించే బృహత్ కార్యక్రమంగా ఉజ్వల్ భారత్ – ఉజ్వల్ భవిష్య కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. ఈ వేడుకలలో పాల్గొని వినియోగదారులు ప్రజలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అందులో భాగంగా జూలై 26 మంగళవారం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఎమ్.ఎఫ్. హల్ లో ఉదయం 10.30 గంటలకు వేడుకలు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. జూలై 26 న జరపనున్న కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అధ్యక్షత వహించగా, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సీనిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జిల్లాకలక్టర్ డా.కె మాధవిలత, పార్లమెంట్ సభ్యులు మర్గాని భరత్ రామ్, జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ రావు, ఎం.పి.పి.గౌ.శ్రీ మందరపు సీతారత్నం, జెడ్.పి.టి.సి. వాసంశెట్టి పెద వెంకన్న తదితరులు హాజరై ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వినియోగదారులు, ప్రజలందరు హాజరై జయప్రదం చేయగలరని విద్యుత్ సంస్థ అధికారులు కోరడం జరిగింది.

మంగళవారం మధ్యాహ్నం కొవ్వూరు లోని (యువరాజ్ ఫంక్షన్ హాల్) జరిగే కార్యక్రమాల్లో హోం మంత్రి డా. తానేటి వనిత , చైర్ పర్సన్ బావన రత్న కుమారి, తదితరులు పాల్గొనడం జరుగుతుందని పర్యవేక్షణ అధికారి టి.వి.యస్.ఎన్ మూర్తి తెలిపారు. సంయుక్త తూర్పు గోదావరి జిల్లాలో ఈనెల 30 వరకూ కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, జగ్గంపేట డివిజన్ల పరిధిలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాల్లో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొంటారని తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *