రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నర్సరీ హబ్ గా పేరుపొందిన కడియం ప్రాంతంలోని నర్సరీలను సందర్శించడం ఒక మంచి అనుభూతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ అధికారులతో అన్నారు. కడియం నర్సరీ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సతీ సమేతంగా ఆదివారం తిలకించడం జరిగింది. నర్సరీ నిర్వాహకులు జస్టిస్ గారిని అంథోరియం మలేషియన్ రెడ్ మొక్క ను అందచేసి ఆహ్వానించడం జరిగింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు వివిధ రకాల అవెన్యూ & సృబ్స్ & ఇండోర్ వెరైటీస్ మొక్కలను చూపించి వాటి ప్రత్యేకతలను జస్టిస్ కు వివరించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సతీ సమేతంగా నర్సరీ ప్రాంగణం లో తిరిగి వివిధ జాతుల మొక్కలు, అరుదైన వృక్ష జాతులు, వాటి సంరక్షణ పద్దతులను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీలకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని తెలుసుకుని చూడడం కోసం రావడం జరిగిందన్నారు. పలు నర్సరీ నిర్వాహకులు ఎన్నో అరుదైన పండ్ల, పూల, ఆర్న్మెంట్, గార్డెనింగ్, ఫెన్సింగ్ తదితర 4 వేల రకాలు మొక్కలు పెంచడం ఇక్కడ ప్రత్యేకత అని ఆధికారులు వివరించారు. ప్రపంచంలో ఎటువంటి వాతావరణం లోనైన పెరిగే వివిధ జాతుల మొక్కల వివరాలు తెలుసుకుని ఆసక్తిగా తిలకించారు. స్వయం గా మహాబిల్వం మొక్క గురించి అడిగి తెలుసుకుని, ఇండ్లలో పెంచుకోవడానికి అనువైన వివిధ రకాల మొక్కలను కొనుగోలు చేయడం జరిగింది.
రాష్ట్ర హై కోర్టు ప్రధాన జస్టిస్ తో పాటుగా తూర్పు గోదావరి జిల్లా అడ్మనిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ డి వి ఎస్ ఎస్ సోమయాజులు, రాష్ట్ర హైకోర్టు జడ్జీ జస్టిస్ ఆర్. రఘునందన రావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి తదితులున్నారు. ఈ పర్యటనలో మునిసిపల్ కమీషనర్, కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డి.హెచ్.ఓ. (హార్టికల్చర్) వి. రాధాకృష్ణ, హెచ్. ఓ, డి. సుధీర్, అడిషినల్ ఎస్. పి. యం. రజని, యం.డి.ఓ, కె. రత్న కుమారి, తాహిసీల్దార్ యం. సుజాత, డి. ఎస్. పి. యం. శ్రీలత, నర్సరీ లకు చెందిన పుల్లా వీరబాబు , పుల్లా రాజశేఖర్ , డా. ఉల్లి వీరమణి, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News