-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, వివిధ సమస్యలపై ప్రజలు అందించిన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 7, ఇంజనీరింగ్ – 2, పబ్లిక్ హెల్త్ విభాగం – 2, రెవిన్యూ విభాగం – 2, అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కే. శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక -1, ఇంజనీరింగ్ విభాగం – 2 అర్జీలు, సర్కిల్ –3 కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ విభాగం – 1 అర్జీ మరియు సర్కిల్ – 2 పరిధిలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.