Breaking News

ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్దిలో సచివాలయ సిబ్బంది భాగస్వామ్యం కావాలి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంతోపాటు గ్రామాభివృద్ధిలో సచివాలయ సిబ్బంది పూర్తి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. గొల్లపూడి పంచాయతీలో గ్రామ సచివాలయాని బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పరిశీలించి సచివాలయానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయడంతోపాటు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలో 3,500 కుటుంబాల వారు నివసిస్తున్నారన్నారు. ఐదు సచివాలయాల ద్వారా సేవలంది ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో
ఉండి మెరుగైన సేవలను అందించాలన్నారు. సచివాలయ పరిధిలో పారిశుద్ద్య కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశుద్ద్య కార్మికులు ప్రజల నుండి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గొల్లపూడి పంచాయతీ పూర్తిగా విజయవాడ నగరంలో కలిసి ఉందన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చినవిధంగా గొల్లపూడి పంచాయతీని కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ పరిధిలోని డివైడర్ల మధ్య నాటిని మొక్కలను ట్రిమ్మింగ్‌ చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. పంచాయతీ పరిధిలో ప్రతి రోజు దాదాపు 15 ట్రాక్టర్ల వ్యర్థపద్దార్థలను సేకరించడం జరుగుతుందని సేకరించిన చెత్తను గుంటూరు జిల్లాలోని నాయుడు పేటకు తరలించేందుకు కృషి చేయాలన్నారు. అవసరమైతే వ్యాపారస్థుల నుండి వ్యర్థపద్దార్థాలను సేకరించేందుకు యూజర్‌ చార్జిలను వసూలు చేసి చెత్త తరలిపుకు అవసరమైన ఖర్చులకు ఉపయోగించుకోవాలన్నారు. గొల్లపూడిలో ప్రాధామిక ప్రాధమికోన్నత పాఠశాలలు రెండు ఒకే భవనంలో నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల సంఖ్యకు సరిపడ గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని ఎస్పీఎన్‌ఆర్‌సి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని గొల్లపూడి పాధమిక పాఠశాలను ఎస్పీఎన్‌ఆర్‌సి పాఠశాలలో విలీనం చేసి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ ఇందుకు అసరమైన ప్రతిపాదానలను వెంటనే సమర్పించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నగదును లబ్దిదారుల ఖాతాలలో జమ చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఖాతాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోనేలా లబ్దిదారులకు వివరించాలని జిల్లా కలెక్టర్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం సమీపంలో గల ప్రభుత్వ ప్రాధమిక ప్రాధమికోన్నత పాఠశాలలను పరిశీలించి ఉపాధ్యాయల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొల్లపూడి పంచాయితిలో డ్రైనేజ్‌ వ్యవస్థ నిర్వహణను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులతో కలిసి పరిశీలించారు.
కార్యక్రమంలో కలెక్టర్‌ వెంట డ్వామా పిడి స్థానిక యంపిడివో జె. సునీత తహాశీల్థార్‌ శ్రీనివాస్‌నాయక్‌ ఏయంసి చైర్మన్‌ కారంపూడి సురేష్‌ స్థానిక నాయకులు జాస్తి జగన్‌మోహన్‌ వేమూరి సురేష్‌ పంచాయితీ కార్యదర్శి బి బ్రహ్మం సచివాలయ సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *