Breaking News

ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పార్క్ లు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్  కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. బుధవారం కమిషనర్ గారు కొరెటేపాడు చెరువు, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత వలివీరారెడ్డి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్  నగరంలో అతి పెద్దదైన కొరెటేపాడు చెరువు వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కాంపౌండ్ వాల్, టాయ్ లెట్స్ నిర్మాణాలకు ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాక్ మరమత్తులు, మౌలిక వసతులు, గ్రీనరి పెంపుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులో దోమల లార్వా పెరగకుండా యాంటి లార్వా ఆపరేషన్లు చేపట్టాలని శానిటరీ ఇన్సెపెక్టర్ని ఆదేశించారు. స్థానిక వాకర్స్ మరియు ప్రజలతో కమిషనర్  మాట్లాడుతూ నగరంలో చెరువులను అత్యత్తమ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయని, పరిపాలన ఆమోదం తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ట్రాక్ ల రెగ్యులర్ మెయిన్ టైన్ ను వాకర్స్ అసోసియేషన్ తీసుకోవాలని సూచించారు.
అనంతరం నాయుడుపేటలో పర్యటించి కమిషనర్  అధికారులతో మాట్లాడుతూ సదరు ప్రాంతంలో పాత యు.జి.డి. లైన్లు పూర్తి సామర్ధ్యంతో పని చేయకపోవడం వలన యు.జి.డి.ఓవర్ ఫ్లో జరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లైన్ ని నాయుడు పేట నుండి అవుట్ ఫాల్ వరకు సమగ్రంగా పరిశీలించి సోమవారం నివేదిక ఇవ్వాలని ఏ.ఈ.ని ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, రోడ్ల మీద ఎక్కడా వ్యర్ధాలు పడకుండా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్సెపెక్టర్, కార్యదర్శులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. డి.శ్రీనివాస్, సెక్టోరల్ అధికారి నాగేంద్ర కుమార్, ఏ.డి.హెచ్. రామారావు, డి.ఈ.ఈ.లు శ్రీనివాసరెడ్డి, మహ్మద్ రఫిక్, ఏ.ఈ.లు అనూష,సునీల్, శానిటరీ ఇన్సెపెక్టర్ సునీత, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *