ఇళ్లు నిర్మాణ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది క్రియా శీలకంగా వ్యవహరించాలి…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు నిర్మాణ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది క్రియా శీలకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కలెక్టరు హౌసింగ్ లేఅవుట్లను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత లబ్దిదారులతో ముఖాముఖి సంబాషించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాన్ని నిర్థేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించేలా సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లు క్షేత్రస్థాయిలో అధికారులతో కలసి పనిచేయాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్క లబ్దిదారుడు ఇంటి నిర్మాణం చేపట్టే దశలో నివాస యోగ్యమైన వసతులకు ప్రాధాన్యత నిస్తూ ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనవసరంగా ఖర్ఛులను తగ్గించి పటిష్టమైన నిర్మాణాలు దిశగా ఆలోచన చేయాలని కలెక్టరు తెలిపారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసిన లబ్దిదారులతో మాట్లాడారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్దిదారులను ఎందుకు ప్రారంభించలేనది అడిగారు. లేఅవుట్ కాలనీకి సంబందించి అనుసందానం రహదారు పనులను యుద్ద ప్రాతిపథికన చేపట్టి పూర్తి చేయాలని అక్కడక్కడే అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయంతో ఇళ్లు లేని నిరు పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నలక్ష్యం లో అందరు భాగస్వామ్యులు కాలన్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది, ప్రతి వాలెంటీరు క్రియాశీలకంగా వ్యవరిస్తే సత్ఫలితాలను వేగవంతంగా సాధించగలుగుతామన్నారు. కలెక్టరు వెంట ఏడీ మైన్స్ యం. విష్ణు వర్థన్, తాహశీల్థారు ఎన్. సత్యనారాయణ, ఎంపీడీవో రమేష్, యంఇవో స్వామినాయక్ ఇతర మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *